‘జైట్లీ చెప్పేదాకా తెలియదు’

206
- Advertisement -

కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన ప్రధాని మోదీ..రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్‌కు బాధ్యతలు అప్పగించటం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇందిరాగాంధీ తర్వాత రక్షణ శాఖ బాధ్యతలు చేపడుతున్న రెండో మహిళగా నిర్మలా సీతారామన్‌ నిలిచారు.

వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ఉన్న ఆమెకు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఎవరూ ఊహించని విధంగా మోదీ కేబినేట్‌ హోదా ఇవ్వడంతో పాటు కీలకమైన రక్షణ శాఖను అప్పగించారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ‘ఇవాళ నాకు ప్రత్యేకమైన రోజు’ అని అన్నారు.

Nirmala Sitharaman - India's first full time woman defence minister

రక్షణ శాఖ అప్పగించే విషయం కొన్ని గంటల ముందువరకు.. జైట్లీ చెప్పే దాకా తెలియదని చెప్పారు. ఇది చాలా పెద్ద బాధ్యత అంటూ తనపై ప్రధాని ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. దైవబలం, పార్టీ నాయకత్వం మద్దతుతోనే తనకు పదోన్నతి లభించిందని చెబుతూ నా మనసంతా నిండిన దేశ సేవకు పునరంకితమవుతానని అన్నారు.

మహిళా సాధికారతకు ప్రధాని కట్టుబడ్డారనడానికి ఇది సంకేతమా అని ప్రశ్నించగా.. ‘‘గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయం నుంచి ఆయన శైలి తెలుసు. ఎప్పు డూ మహిళల వాటా మహిళలకు దక్కాలని అనుకుంటారు. మ హిళలు కూడా ఏదైనా సాధించగలరని నమ్ముతారు’’ అని చెప్పారు. తన శాఖను సమర్థంగా నిర్వహించడంతో పాటు 2019 ఎన్నికల బాధ్యతలను సైతం నిర్వర్తించగలనన్న విశ్వాసం ఉందన్నారు.

- Advertisement -