జైల్లో గుర్మీత్ కేకలు..

174
'Godman' Ram Rahim is now Qaidi no 1997; sleeps on floor, eats dal ...
- Advertisement -

సొంత సామ్రాజ్యం, సకల సౌఖ్యాలు, ‘గుఫా’ పేరుతో ఖరీదైన పడకలపై రాసక్రీడలు ఇలా ఒకటేమిటి… బాబా ముసుగులో ఎన్నో దారుణాలకు పాల్పడిన గుర్మీత్ రాం రహీం సింగ్ బాబా.. రోహ్‌తక్‌లోని సునరియా జైలులో రోజుకు రూ.40 కూలికి తోటపని చేస్తున్నాడు. డేరా సచ్చా సౌదాలో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన గుర్మీత్.. జైలు క్యాంటీన్ నుంచి మినరల్ వాటర్ తెప్పించుకొని తాగుతున్నాడు.

మసాజ్ చేసేందుకు తన దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ ను జైలులో ఉంచాలన్న అతని కోరికను న్యాయస్థానం తిరస్కరించడంతో… గుర్మీత్ సింగ్ కు పిచ్చెక్కిపోతోందట. సిర్సా డేరాలోని అత్యంత ఖరీదైన పరుపులపై పడుకున్న బాబా.. ఇప్పుడు తనకు కేటాయించిన జైలు గదిలోని గోడలతో మాట్లాడుతూ సమయం గడుపుతున్నారు. తొలి రెండు రోజులు కన్నీరు మున్నీరైన గుర్మీత్.. జైలు గదిలో దోమల బాధతో ఓ మూలన పడున్నాడు. కాగా,గుర్మీత్ రెండు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. వీటి విచారణ చివరి దశలో ఉంది. ఇవేకాకుండా తన అనుచరుల వృషణాలను తొలగిస్తున్నాడనే అభియోగాన్ని సీబీఐ మోపింది. గుర్మీత్ శనివారానికి వారంరోజుల జైలుశిక్షను పూర్తి చేసుకున్నాడు.

గుర్మీత్‌ తన కుటుంబాన్ని కలుసుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ ఓ లిస్ట్‌ జైలు అధికారులకు ఇచ్చాడు. వీరిలో అత‌ని ద‌త్త‌పుత్రిక హ‌నీ ప్రీత్ ఇన్సాన్ కూడా ఉంది. అయితే అత్యాచారం కేసులో గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్‌కు జైలు శిక్ష పడిన త‌ర్వాత హ‌నీ ప్రీత్ నేపాల్ పారిపోయిన‌ట్లు తెలుస్తోంది. ఆమె మీద లుకౌట్ నోటీసు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఆమె మీద రాజ‌ద్రోహం నేరంతో పాటు, గుర్మీత్ విచార‌ణ‌కు హాజ‌ర‌వ‌డానికి ముందు అత‌ను త‌ప్పించుకోవ‌డానికి స‌హాయ‌ప‌డింద‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. డేరా చీఫ్ ఆదిత్యా ఇన్సాన్‌పై కూడా ఇవే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

- Advertisement -