నరేంద్రమోదీ కేబినెట్‌లో మంత్రులకు శాఖలు కేటాయించారు. గత మంత్రి వర్గంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్‌కు అత్యంత కీలకమైన ఆర్థికశాఖ అప్పగించారు. కొత్తగా మంత్రివర్గంలోకి చేరిన అమిత్ షాకు హోంశాఖ అప్పగించారు. నిన్న రాత్రి 57 మందితో కొత్త కేబినెట్ కొలువుదీరింది. ఇందులో 24 మందికి కేబినెట్, 9 మందికి స్వతంత్ర హోదా, 24 మందికి సహాయ మంత్రుల హోదా కల్పించారు.
ఈ దఫా మంత్రివర్గంలో 20 మంది కొత్తవారికి అవకాశం లభించింది. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మాలా సీతారామన్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు కేంద్ర మంత్రులుగా పదవి బాధ్యతలు చేపట్టిన వారిలో నిర్మలా సీతారామన్ తోపాటు.. సుబ్రహ్మణ్యం జయశంకర్,ధర్మేంద్ర ప్రధాన్, గజేంద్ర సింగ్ షకావత్, రమేశ్ పోక్రియాల్, పీయూష్ గోయల్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ప్రకాష్ జవడేకర్, జితెందర్ సింగ్, రాం విలాస్ పాశ్వాన్, కిరణ్ రిజుజు లు ఉన్నారు.