ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగులను వెల్లడించిన కేంద్రం..

234
- Advertisement -

2021 సంవత్సరానికి గాను ఎన్ఐఆర్ఎఫ్ (నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్ వర్క్) ర్యాంకింగ్స్ వెల్లడించారు. దేశంలో టాప్ 100 విద్యా సంస్థ‌ల‌కు ర్యాంకింగ్స్‌ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంధ్ర ప్ర‌ధాన్ ప్ర‌క‌టించారు. ఈ టాప్ 100 విభాగంలో ఏపి, తెలంగాణ‌కు చెందిన ప‌లు యూనివ‌ర్సిటీలు, కాలేజీలు ఉన్నాయి.

యూనివ‌ర్సీటీల‌లో.. ఇండియ‌న్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్స్ యూనివ‌ర్సీటీ నెంబ‌ర్ వ‌న్‌ ర్యాంక్‌, యూనివ‌ర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు ఆరో ర్యాంక్‌, ఆంధ్రాయూనివ‌ర్సిటీకి 24వ ర్యాంక్‌, ఎస్వీ యూనివ‌ర్సిటీకి 54వ ర్యాంక్‌ వచ్చింది.

ప‌రిశోధ‌న‌ విభాగంలో.. క‌ర్ణాట‌క‌లోని ఇండియ‌న్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్స్ కు తొలి ర్యాంక్,హైద‌రాబాద్ ఐఐటికి 15వ ర్యాంక్‌, హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివర్సిటీకి 25వ ర్యాంక్‌లో నిలిచాయి.

ఫార్మ‌సీ విద్య‌లో.. హైద‌రాబాద్ నేష‌న‌ల్ ఫార్మా ఇన్సిట్యూట్ ఆఫ్ కు ఆరో ర్యాంక్, కాక‌తీయ యూనివ‌ర్సిటీకి 48వ ర్యాంక్, అనురాగ్ యూనివ‌ర్సిటీకి 61, విష్ణు ఇన్సిట్యూట్ కు 72, ఏపీలోని ఏయూ ఫార్మా కాలేజ్ కి 30వ ర్యాంక్, ప‌ద్మావ‌తి మ‌హిళా విశ్వ‌విద్యాల‌యానికి 40వ ర్యాంక్, ఎస్వీ యూనివ‌ర్సిటీకి 54, రాఘ‌వేంద్ర ఇన్సిట్యూట్ కు 55వ ర్యాంక్, చ‌ల‌ప‌తి ఇన్సిట్యూట్ కు 69వ ర్యాంక్‌ లు వచ్చాయి.

లా కాలేజీల్లో.. తెలంగాణ న‌ల్సార్ యూనివ‌ర్సిటీకి మూడోవ ర్యాంక్, ఇక్పై ఫండేష‌న్ ప‌ర్ హైయ‌ర్ ఎడ్యూకేష‌న్ 29, ఓవ‌రాల్ ర్యాంకింగ్స్ లో.. వ‌రంగ‌ల్ నిట్ కు 59వ ర్యాంక్, ఐఐటీ హైద‌రాబాద్ కి 16, సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీకి 17, ఉస్మానియా యూనివ‌ర్సిటీకి 62, ఆంధ్రా యూనివ‌ర్సిటీకి 48, ఎస్వీ యూనివ‌ర్సిటీకి 92 ర్యాంక్‌లో నిలిచింది.

మెడిక‌ల్ కాలేజ్ విభాగంలో.. నారాయ‌ణ మెడిక‌ల్ కాలేజ్ కి 43వ ర్యాంక్‌లో నిలిచింది.

ఆర్కిటెక్చ‌ర్ విభాగంలో.. ఏపీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చ‌ర్ 8వ ర్యాంక్ వచ్చింది.

మేనెజ్ మెంట్ కాలేజ్ లో.. ఐఐఎమ్ గుజ‌రాత్ కు ఫ‌స్ట్ ర్యాంక్, ఇక్ఫై హైద‌రాబాద్ కు 27వ ర్యాంక్, ఏపీలోని కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ 38వ ర్యాంక్‌, క్రియా యూనివ‌ర్సిటీకి 50వ ర్యాంక్‌ తెలంగాణ‌లోని ఐఐఎమ్ టీకి 63వ ర్యాంక్ దక్కింది.

- Advertisement -