మొక్కలు నాటిన రిటైర్డ్ ఐఏఎస్ రామ్ చంద్ తేజావత్..

83

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేర‌కు సామాన్యుల‌తో పాటు ప్ర‌ముఖులు సైతం ముందుకు వ‌స్తున్నారు. త‌మ వంతుగా మొక్కలు నాటుతూ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా హైద‌రాబాద్ లక్డీక‌పూల్‌లో నిలోఫ‌ర్ స‌మీపంలోని ఎమ్ఎన్ జే ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో రిటైర్డ్ ఐఏఎస్, ఢిల్లిలో తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హ‌దారుడు రామ్ చంద్ తేజావత్ 68వ‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయ‌న‌తో మొక్క‌ను నాటించారు.

అలాగే వృక్ష‌వేద పుస్త‌కం, ఎకో గ‌ణేష్ విగ్ర‌హాన్ని ఆయ‌న‌కు అంద‌జేశారు. ఇక ఆయ‌న పుట్టిన రోజు సంధ‌ర్భంగా 350 మంది క్యాన్స‌ర్ పేషంట్ల‌కు ర‌క్త‌దాన కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంధ‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించడం సంతోష‌క‌ర‌మ‌ని ఆయ‌న కొనియాడారు. మాన‌వాళి మున్ముందు జీవ‌నానికి గ్రీన్ ఇండియా కార్య‌క్ర‌మం చాలా ఉపయోగ‌క‌ర‌మ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్టీఐ క‌మిష‌న‌ర్ శంక‌ర్ నాయ‌క్, గిరిజన ఐక్య వేదిక రాష్ట్ర అధ్య‌క్షులు రాజ్ కుమార్, ఎస్ ఆర్ సాఫ్ట్‌వేర్ సొల్యుష‌న్ ఎండీ రామ్ నాయ‌క్ పాల్గొన్నారు.