కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ జాబితాను విడుదల చేశారు. జాతీయ స్థాయిలో 10 విభాగాల్లో విద్యాసంస్థలకు వచ్చిన ర్యాంకింగ్స్. ఈవిధంగా ఉన్నాయి.
ఓవరాల్ ఇనిస్టిట్యూషన్..
ఐఐటీ మద్రాస్ కు మొదటి స్థానం.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు రెండో స్థానం.
ఐఐటీ ఢిల్లీ మూడోస్థానం.
యూనివర్సిటీ విద్యాసంస్థలు..
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకు మొదటి స్థానం.
జెఎన్యూ న్యూఢిల్లీ రెండో స్థానం.
బనారస్ హిందు యూనివర్సిటీ వారణాసి మూడో స్థానం.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 8వ స్థానం.
ఇంజినీరింగ్ విద్యాసంస్థలు..
ఐఐటీ మద్రాస్ కు మొదటి స్థానం.
ఐఐటీ ఢిల్లీ రెండోస్థానం.
ఐఐటీ బాంబే మూడో స్థానం.
ఐఐటీ హైదరాబాద్ కు 8 వ స్థానం.
మేనేజ్మెంట్ విద్యాసంస్థలు..
ఐఐఎం అహ్మదాబాద్ కు మొదటి స్థానం.
ఐఐఎం బెంగళూరు రెండోస్థానం.
ఐఐఎం కలకత్తా మూడోస్థానం.
కళాశాల విద్యాసంస్థలు..
మిరండ హౌస్ ఢిల్లీకి మొదటి స్థానం.
లేడీ శ్రీరాం కాలేజ్ ఫర్ విమెన్ న్యూ ఢిల్లీ రెండో స్థానం.
హిందూ కాలేజ్ ఢిల్లీ మూడో స్థానం.
ఫార్మ విద్యాసంస్థలు..
జమియా హందార్డ్, న్యూ ఢిల్లీకి మొదటి స్థానం.
పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్ రెండో స్థానం.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసుటికల్ అండ్ రీసెర్చ్ మొహాలీ మూడో స్థానం.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసుటికల్ అండ్ రీసెర్చ్ హైదరాబాద్ కు 5వ స్థానం.
న్యాయ విద్యాసంస్థలు..
నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ కి మొదటి స్థానం.
నేషనల్ లా యూనివర్సిటీ న్యూ ఢిల్లీ రెండోస్థానం.
నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా హైదరాబాద్‌కు మూడోస్థానం.
విద్యావిద్యాసంస్థల్లో ఎయిమ్స్ ఢిల్లీకి మొదటి స్థానం.
దంత వైద్య విద్యాసంస్థల్లో మౌలానా ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ కి మొదటి స్థానం.