దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష ఖరారు చేస్తు అత్యున్నత న్యాయస్ధానం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. నిర్బయ నిందితులు పేదవారిని వారి కుటుంబ సభ్యుల శ్రేయస్సు దృష్ట్యా వారికి క్షమాభిక్ష పెట్టాలని నిందితుల తరపును న్యాయవాదులు వాదించిన న్యాయస్ధానం పరిగణలోకి తీసుకోలేదు. ఢిల్లీ హైకోర్టు వాదనతో ఏకీభవించిన న్యాయస్ధానం దోషులకు ఉరిశిక్షను వేస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపుగా ఐదేళ్ల తర్వాత నిందితులకు శిక్ష ఖరారైంది.
నిర్భయ కేసుపై ప్రజల ఆసక్తి, సంక్లిష్టతల దృష్ట్యా దోషుల తరపున న్యాయవాదులు ఉన్నప్పటికీ సుప్రీం మరో ఇద్దరు సీనియర్ న్యాయవాదులను దోషుల తరపున వాదించేందుకు నియమించింది. రాజు రామచంద్రన్, సంజయ్ హెడ్డేలను అమికస్ క్యూరీగా చేర్చింది. వీరు వాదనలు వినిపిస్తూ దోషులకు అత్యున్నత శిక్ష అయిన ఉరిశిక్ష సరికాదని విజ్ఞప్తి చేశారు. సుప్రీం తీర్పుపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ కూతురికి సరైన న్యాయం జరిగిందని తెలిపారు. అయితే సుప్రీం ఉరిశిక్షను ఖరారు చేసిన రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరేందుకు అవకాశం ఉంటుంది. రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది.
2012 డిసెంబర్ 16న రాత్రి నిర్భయ మీద అత్యాచారం జరిగినప్పుడు బస్సులో నలుగురితో పాటు మరో ఇద్దరు ఉన్నారు. రామ్ సింగ్ తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో కేవలం మూడేళ్ల శిక్ష అనుభవించి స్వేచ్ఛగా బయటకు వెళ్లిపోయాడు. ఈ కేసు 2013 లో ప్రత్యేక కోర్టు అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్ లకు ఉరిశిక్ష విధించింది. హైకోర్టు కూడా మరుసటి సంవత్సరం దాన్ని ఖరారు చేసింది. దీన్ని సవాలు చేస్తూ నిందితులు లు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడంతో తుది తీర్పు వెలువడేందుకు ఇన్నాళ్ల సమయం పట్టింది.