‘ట్యూబ్‌లైట్‌’..వెలిగింది..

209
Tubelight: Here's when trailer of Salman Khan's film will be released
- Advertisement -

వరుస బ్లాక్‌ బస్టర్లతో బాలీవుడ్‌ బాక్సాఫీస్‌కు దడ పుట్టిస్తున్నాడు సూపర్‌  స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌. భజరంగీ భాయ్‌జాన్‌, సుల్తాన్‌ వంటి భారీ సూపర్‌హిట్ల తర్వాత సల్మాన్‌ నటిస్తున్న లెటెస్ట్‌ మూవీ ’ట్యూబ్‌లైట్‌’. సల్మాన్‌తో ’ఏక్‌ థా టైగర్‌’, ’బజరంగీ భాయ్‌జాన్‌’ వంటి హిట్‌ సినిమాలు తెరకెక్కించిన కబీర్‌ ఖాన్‌ ఈ సినిమాకు దర్శకుడు. అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ను తాజాగా చిత్రయూనిట్‌ విడుదల చేసింది.
 Tubelight: Here's when trailer of Salman Khan's film will be released
అయితే  2016లో వచ్చిన ‘బజరంగీ భాయ్‌జాన్‌’ సినిమాలోసల్మాన్‌ మున్నీ అనే చిన్నారితో కలిసి నటించినట్లుగానే ఈ సినిమాలోనూ ఓ బాలుడితో కలిసి నటిస్తున్నాడు. ఇందులో సల్మాన్‌ మానసిక వికలాంగుడి పాత్రలో నటిస్తుండడంతో సినిమాకి ‘ట్యూబ్‌లైట్‌’ అని టైటిల్‌ పెట్టారట. ఇక టీజర్‌లో.. ‘నమ్మకం ట్యూబ్‌లైట్‌ లాంటిది. లైట్‌ నిదానంగా వెలిగినట్టే నమ్మకం కూడా నిదానంగా కలుగుతుంది. కానీ ఒక్కసారి వెలిగాక మన చూట్టూ వెలుగు నింపుతుంది’ అన్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.
Tubelight: Here's when trailer of Salman Khan's film will be released
రియల్‌ లైఫ్‌ సోదరుడు సొహైల్‌ ఖాన్‌తో సల్మాన్‌ ఈ సినిమాలోనూ సోదరుడిగా నటిస్తున్నాడు. యుద్ధం జరుగుతున్న సమయంలో సొహైల్‌ సరిహద్దు దాటి వెళ్లడంతో సల్మాన్‌ అతన్ని రక్షించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు అన్నదే సినిమా కథ. ఇందులో చైనీస్‌ నటి చూ చూ హీరోయిన్‌ గా నటిస్తోంది. రంజాన్‌కి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక యూట్యూబ్‌ లో ట్యూబ్ లైట్ టీజర్‌కు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అంతేకాదు సల్మాన్ నటనకు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు.

 

- Advertisement -