- Advertisement -
నిర్భయ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. దోషులు తప్పించుకోవడానికి అన్ని దారులు ఉపయోగిస్తున్నారు. ఈ కేసులో దోషులకు ఈ నెల 3 తేదీన ఉరి తీయాల్పివుండగా అది వాయిదా పడింది. తాజాగా ఈ కేసు విచారించిన కోర్టు మరోసారి దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో నలుగురు దోషులకు పటియాలా హౌస్ కోర్టు కొత్త డెత్ వారెంట్లు జారీ చేసింది.
ఈ నెల 20వ తేదీన ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని పటియాలా హౌస్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేందర్ రానా ఆదేశాలు జారీ చేశారు. ఉరి శిక్షకు సంబంధించి తీహార్ జైల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే మూడు సార్లు నలుగురు నిందితులకు ఉరి శిక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. మరి ఈ సారైనా ఉరిశిక్ష అమలు అవుతుందా.. లేదా.. అనేది వేచిచూడాలి.
- Advertisement -