Niranjan:రైతు భరోసా ఎప్పుడిస్తారు?

15
- Advertisement -

రుణమాఫీని బూచిగా చూపి.. రైతు భరోసాను బంద్ పెట్టే పనిలో కాంగ్రెస్ ఉందని ఆరోపించారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన సింగిరెడ్డి…కేసీఆర్ హయాంలో 4.5 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి వెచ్చించాం అన్నారు.

కేసీఆర్ తీసుకున్న చర్యలతో రైతాంగం బాగుపడటంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయిందని..కానీ ఇప్పుడు ఏవేవో సాకులు చెప్పి రైతులకు సాయాన్ని ఎగ్గొట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపుతోందన్నారు. కాలయాపన చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా మారిందని..రైతుల పరిస్థితి ఘోరంగా మార్చిన రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికలకు ముందు ప్రజలను నమ్మబలికి నట్టేటముంచే పనిచేస్తున్నారని విమర్శించారు. ఆకలి అవుతుంది అంటే ఆరు నెలలు ఆగండి అన్నట్టు కాంగ్రెస్ తీరు ఉందని…రేవంత్ ప్రభుత్వం వచ్చి మూడు సీజన్లు అయినా రైతు భరోసా కాదు కదా రైతు బంధు కూడా లేదన్నారు.

Also Read:TTD:టీటీడీ ధరల్లో మార్పు..పుకార్లే

- Advertisement -