“సరిలేరు నీకెవ్వరు” సెకండ్ సాంగ్

328
sarileu Nikevariu Suryudivo Song

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈచిత్రంలో మహేశ్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించనున్నారు. లేడి అమితాబ్ విజయశాంతి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, వెన్నెల కిశోర్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా డిసెంబర్ నెలలో ఈమూవీ సాంగ్స్ ను విడుదల చేయనున్నారు. ఈ నెలలో ఐదు సొమవారాల్లో ఐదు పాటలను విడుదల చేయనున్నారు. ఇప్పటికే చివరి సోమవారం మైండ్ బ్లాక్ అనే పాటను విడుదల చేశారు. తాజాగా కాసేపటి క్రితం సూర్యుడివొ చంద్రుడివొ అనే పాటను విడుదల చేశారు. ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రీ ఈపాటను రాశారు. మహేశ్ బాబు మహర్షి చిత్రం తర్వాత ఈసినిమా చేస్తుండటంతో భారీగా అంచనాలున్నాయి.