ఎల్‌నినో ఉంటే ఏపీలో వరి ఎందుకు?

1
- Advertisement -

ఎల్ నినో ప్రభావం ఉంటే ఏపీలో ఎందుకు వరి వేస్తున్నారు? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాణలో ఎందుకు వేయడం లేదు.. పైనుండే కదా కిందికి నీళ్లు పోయేది… ఆంధ్ర వాళ్లకు నీళ్లు ఎలాగైనా వస్తాయని నమ్మకం ఉంది. అందుకే వరి వేసుకున్నారు అని ఆరోపించారు.

తెలంగాణ ప్రజల కంటే ఆంధ్ర ప్రజలకు రేవంత్ రెడ్డిపై ఎక్కువ నమ్మకం ఉంది.. ఎందుకంటే నీళ్లు ఎలాగైనా కిందికి వదిలిపెడతాడని తెలుసు కాబట్టి నాలుగు రోజులు లేట్ అయినా 4 టీఎంసీల నీళ్లు కిందికి పోతాయి.. 4 టీఎంసీలతో 40 వేల ఎకరాలు పండించవచ్చు అన్నారు.

ఈ సంవత్సరం వర్షాలు పడకపోయినా వచ్చే సంవత్సరం వరకు మన రిజర్వాయర్లలోని నీటితో మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వొచ్చని సంబంధిత ఇంజినీర్లు చెప్పారు కానీ వర్షాలు పడలేదు, మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వలేకపోతున్నామని రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్, వ్యవసాయ మంత్రి తుమ్మల అంటున్నారు.. వీళ్లకు అవగాహన ఉండి మాట్లాడుతారో, లేక అవగాహన లేక మాట్లాడుతారో అర్థం కాదు అన్నారు. మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా ఇచ్చేందుకు చేతకాక, అవగాహన లేక వర్షాలు పడలేదని ప్రజలను గందరగోళపరుస్తున్నారు అని మండిపడ్డారు.

Also Read:విరాళాల చోరీ..SP ఎంపీల నిరసన

- Advertisement -