కేరళాని నిపా వైరస్ వణికిస్తోంది. చాపకింద నీరులా వ్యాపిస్తున్న ఈ ప్రాణాంతక వ్యాధితో కేరళ ప్రభుత్వంతో పాటు కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే ఈ వైరస్‌తో ఇద్దరు మృతిచెందగా నలుగురు చికిత్స తీసుకుంటున్నారు. నిపా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కేరళ రాష్ట్రానికి కేంద్ర వైద్యనిపుణుల బృందం వచ్చింది.
కోజికోడ్ నగరంలో 12 ఏళ్ల బాలుడు నిపా వైరస్‌తో మరణించగా పరిసర ప్రాంతాల్లోని మేకల నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్ష కోసం ల్యాబ్ కు పంపించారు. పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పరీక్ష కోసం పంపిన ఐదు నమూనాల్లో మూడు పాజిటివ్‌గా వచ్చాయని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. నిపా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేరళ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ వైరస్ వల్ల మరణించిన బాలుడి కుటుంబం పరిసరప్రాంతాల్లోని ఇళ్లలో ఫీవర్ సర్వే నిర్వహించారు.
Also Read:సెట్విన్ కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ సంతోష్..
మెదడుకు హాని కలిగించే ప్రాణాంతక వైరస్ సోకిన గబ్బిలాలు, పందులు,ఇతర వ్యక్తుల శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా మానవులకు వ్యాపిస్తుంది.