రాష్ట్రానికి కొత్తగా 9 మంది ఐఏఎస్‌లు..

35
telangana

సివిల్ సర్వీసెస్ 2019 బ్యాచ్ అభ్యర్థులకు క్యాడర్ కేటాయిస్తూ కేంద్రం శ్రుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా 25 రాష్ట్రాలకు 179 మంది ఐఏఎస్ (ఏఐఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్) లను కేటాయించింది. తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 9 మంది ఐఏఎస్ ల కేటాయించగా..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా 8 మంది ఐఏఎస్ లను కేటాయింపు జరిగింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, తెలంగాణా రాష్ట్రానికి చెందిన పి. ధాత్రి రెడ్డిని ఒడిషాకు, కట్టా రవితేజను, బానోతు మృగేందర్ లాల్ ను తమిళనాడుకు కేటాయించారు.

తెలంగాణా క్యాడర్ కేటాయింపబడ్డ అధికారులు..

  1. మయాంక్ మిట్టల్ (ఉత్తరప్రదేశ్)
  2. అభిషేక్ అగస్త్య (జమ్మూ కాశ్మీర్)
  3. అపూర్వ్ చౌహన్ (ఉత్తరప్రదేశ్)
  4. మంద మకరంద (తెలంగాణా)
  5. అశ్విని తానాజీ వాకడే (మహారాష్ట్ర)
  6. బీ. రాహుల్ (తెలంగాణా)
  7. ప్రతిభా సింగ్ (రాజస్థాన్)
  8. ప్రఫుల్ దేశాయ్ (కర్ణాటక)
  9. పీ. కదిరవన్ (తమిళనాడు).