వ్యాక్సిన్ పంపిణీపై మంత్రి సమీక్ష..

39

ఈ నెల 16వ తేదీ నుంచి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా జెడ్పీ కార్యాలయంలో శుక్రవారం వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ సమీక్ష నిర్వహించారు. వ్యాక్సిన్ ఏర్పాట్లపై తీసుకుంటున్న చర్యలుపై అధికారులతో చర్చించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొంతమంది వ్యాక్సిన్‌పై అపోహలు సృష్టిస్తున్నారు. అందులో వాస్తవం లేద‌న్నారు. అనేక పరీక్షల తర్వాతే వ్యాక్సిన్‌ను తీసుకువ‌చ్చిన‌ట్లు చెప్పారు. ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌కే మొద‌ట‌గా వాక్సిన్ అందిస్తున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు. వ్యాక్సిన్ రాకతో గత పది నెలలుగా ఎదుర్కొన్న కష్టాలు తీరనున్న‌ట్లు మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ తెలిపారు.

ఈ స‌మావేశంలో జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్ కుమారి ఆంగోతు బిందు, కలెక్టరు వి.పి గౌతమ్, అదనపు కలెక్టర్ అభినవ అభిలాష, జెడ్పీ సీఈవో సన్యాసయ్య, ఆర్డీవో కొమురయ్య, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, ఇతర అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.