- Advertisement -
సివిల్ సర్వీసెస్ 2019 బ్యాచ్ అభ్యర్థులకు క్యాడర్ కేటాయిస్తూ కేంద్రం శ్రుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా 25 రాష్ట్రాలకు 179 మంది ఐఏఎస్ (ఏఐఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్) లను కేటాయించింది. తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 9 మంది ఐఏఎస్ ల కేటాయించగా..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా 8 మంది ఐఏఎస్ లను కేటాయింపు జరిగింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, తెలంగాణా రాష్ట్రానికి చెందిన పి. ధాత్రి రెడ్డిని ఒడిషాకు, కట్టా రవితేజను, బానోతు మృగేందర్ లాల్ ను తమిళనాడుకు కేటాయించారు.
తెలంగాణా క్యాడర్ కేటాయింపబడ్డ అధికారులు..
- మయాంక్ మిట్టల్ (ఉత్తరప్రదేశ్)
- అభిషేక్ అగస్త్య (జమ్మూ కాశ్మీర్)
- అపూర్వ్ చౌహన్ (ఉత్తరప్రదేశ్)
- మంద మకరంద (తెలంగాణా)
- అశ్విని తానాజీ వాకడే (మహారాష్ట్ర)
- బీ. రాహుల్ (తెలంగాణా)
- ప్రతిభా సింగ్ (రాజస్థాన్)
- ప్రఫుల్ దేశాయ్ (కర్ణాటక)
- పీ. కదిరవన్ (తమిళనాడు).
- Advertisement -