నిందితులు ఎవ్వరైనా వదలం:కేటీఆర్‌

18
- Advertisement -

మెడికో పీజీ విద్యార్థిని ప్రీతి మృతిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సైఫ్ అయిన సంజయ్ అయిన వదిలేదని స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి… ప్రీతి మృతిపై స్పందిస్తూ..ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

కాలేజీలో జరిగిన ర్యాగింగ్‌ వల్ల ప్రీతి మృత్యవాత పడటం చాలా బాధకరమన్నారు. ఈ విషయాన్ని కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఎంతటివారైనా వదిలేది లేదన్నారు. గత ఐదు రోజులగా మృత్యువుతో పోరాడిన వైద్య విద్యార్థిని ప్రీతి ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రీతి స్వగ్రామమైన గిర్నితండాకు ఆమె మృతదేహాన్ని సోమవారం ఉదయం ఆమె మృతదేహాన్ని స్వగ్రామమైన గిర్ని తండాకు తీసుకెళ్లారు. ప్రీతి ఇంటికి సమీపంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేశారు.

ఇవి కూడా చదవండి…

ఎన్‌సీడబ్ల్యూ సభ్యురాలిగా ఖుష్బూ…

2000 వేల నోటు రద్దు ?

రాహుల్ ” మరో యాత్ర “.. జోడో ఇచ్చిన జోష్ !

- Advertisement -