నిఖిల్..’స్వయంభు’ అప్‌డేట్

26
- Advertisement -

రీసెంట్‌గా స్పై సినిమాతో మెప్పించిన నటుడు నిఖిల్ తాజాగా స్వయంభుగా ప్రేక్షకుల ముందుకురానున్న సంగతి తెలిసిందే. ఇటీవల నికిల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని అనౌన్స్‌ చేయగా ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తుండగా ఇవాళ మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.

ఓ వారియర్ గా నిఖిల్ ని మేకర్స్ ప్రెజెంట్ చేయగా ఇందులో నిఖిల్ లుక్ అదిరిపోయింది. ఓ గుర్రంపై బాణం వేస్తున్నట్టుగా కనిపిస్తున్న ఈ లుక్ బాగుంది. ఇవాళ్టి నుండి ఈ పాన్ ఇండియా చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి కేజీయఫ్ ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాని పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తుండగా భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నాడు. నిఖిల్ సరసన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Also Read:చిరు నిజంగానే పది కోట్లు వెనక్కి ఇచ్చేశారా?

- Advertisement -