Baby:ఇక ఓటీటీ వంతు!

22
- Advertisement -

ఆనంద్ దేవ‌ర‌కొండ, వైష్ణ‌వి చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్న చిత్రం బేబీ. జులై 14న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టింది. దేశీయంగానే కాదు ఓవర్సీస్‌లోనూ సత్తా చాటి భారీ వసూళ్లను రాబట్టింది.

దాదాపు నెలన్నర తర్వాత ఓటిటి లో రిలీజ్ కావడానికి సిద్ధం అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా ఓటిటి రైట్స్ ఆహా సొంతం చేసుకోగా ఈ నెల 25 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ అందించగా టాలీవుడ్ ప్యాషనేట్ నిర్మాత ఎస్ కె ఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Also Read:చిరు నిజంగానే పది కోట్లు వెనక్కి ఇచ్చేశారా?

విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం కేవలం 8 రోజుల్లో రూ.50 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది. టాలీవుడ్ ప్రముఖులు సైతం బేబి మూవీకి ఫిదా అయ్యారు.

- Advertisement -