Nikhil:స్పై రిలీజ్ డేట్ ఫిక్స్

57
- Advertisement -

‘కార్తికేయ 2’ నేషన్‌ వైడ్ బ్లాక్‌ బస్టర్ విజయం తర్వాత హీరో నిఖిల్ మరో నేషనల్ థ్రిల్లర్ తో వస్తున్నారు. ఇది భారత్ హిడెన్ స్టొరీ. 2023 ఇండియన్ బెస్ట్ సీక్రెట్ కోసం పోరాటం. ఇది నిఖిల్ పాన్-ఇండియన్ చిత్రం ‘స్పై’ నేపథ్యం. బ్యాక్‌డ్రాప్‌ ను రివీల్ చేయడానికి మేకర్స్ ఒక చిన్న వీడియోను విడుదల చేశారు.

కంట్రీ బెస్ట్ సీక్రెట్ ఏమిటి? తుమ్ ముజే ఖూన్ దో, మై తుమ్హే ఆజాదీ దూంగా (మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను) అనే నినాదం ఇచ్చిన సుభాష్ చంద్రబోస్ గురించి. సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇలా దాగి ఉన్న కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయం. స్పై చిత్రం ఈ జానర్ లో డిఫరెంట్ మూవీ.

Also Read:హ్యాపీ బర్త్ డే…సందీప్ కిషన్

ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని చ‌ర‌ణ్ తేజ్ ఉప్ప‌లపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె రాజ శేఖ‌ర్ రెడ్డి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 29న స్పై ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు. టీజర్‌ ను మే 12న విడుదల చేయనున్నారు.

నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తుండగా, సన్యా ఠాకూర్ సెకండ్ లీడ్ గా ఓ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తోంది. ఆర్యన్ రాజేష్ తన కమ్ బ్యాక్ లో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను అందించారు. ఈ కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ స్పై థ్రిల్లర్‌ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.చిత్రం గ్లింప్స్, ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన స్పందన లభించింది.

Also Read:మొక్కలు నాటిన ఆర్.నారాయణమూర్తి

- Advertisement -