మా పెళ్లిని క‌రోనా కాదు ఏదీ ఆప‌లేదు- హీరో నిఖిల్

444
Nikhil Siddharth
- Advertisement -

టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు హీరో నిఖిల్. కొత్త కథలను ఎంచుకుంటూ.. సినిమాలు తీస్తూ.. అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. హ్యాపీడేస్ సినిమాతో పరిచమైన తరువాత వరుస సినిమాలు చేస్తూ.. పలు విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. త్వరలో ఈ యంగ్‌ హీరో పెళ్లి కొడుకు కానున్నాడు. డాక్టర్ పల్లవి వర్మతో ఈ మధ్యే గోవాలో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఏప్రిల్ 16 వాళ్ల పెళ్లి ముహూర్తంగా నిర్ణ‌యించారు.

అయితే ప్ర‌స్తుతం కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండడంతో ప్ర‌భుత్వం ఫంక్ష‌న్ హాల్స్ బుకింగ్స్‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుంది. ఈ నేప‌థ్యంలో నిఖిల్ పెళ్ళి వాయిదా ప‌డుతుంద‌ని కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. దీనిపై తాజా స్పందించిన నిఖిల్‌.. ఏప్రిల్ 16న జ‌ర‌గ‌బోయే మా పెళ్లిని క‌రోనా గాని ఇంక వేరేది ఏది గాని ఆప‌లేదు. ఒక‌వేళ ఏవైన అడ్డంకులు వ‌స్తే.. మేమిద్ద‌రం గుడికి వెళ్లి వివాహం చేసుకుంటాం. అంతేకాని పెళ్లిని పోస్ట్ పోన్ చేయ‌మ‌ని నిఖిల్ స్పష్టం చేశారు.

జీవితంలో పెళ్లి అనేది ఎవరికైనా ఓ గొప్ప ఫీలింగ్. కానీ ప్రజల బాగోగులు కూడా చాలా ముఖ్యమనేది మరిచిపోకూడదు. ప్రజలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సన్నిహితుల సేఫ్టీని దృష్టిలోపెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నాం. ఇప్పటికే ఈ నెలలో జరుగాల్సిన బ్యాచ్‌లర్ పార్టీ, ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలను వాయిదా వేసుకొన్నాం. అనుకొన్న తేదీకే పెళ్లి జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు అని నిఖిల్ అన్నారు. ఇప్పటికే కన్వెన్షన్ హాల్‌‌ను అడ్వాన్స్‌గా బుక్ చేసుకొన్నాం. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. వచ్చేవారం పరిస్థితులు మెరుగుపడుతాయనే ఆశాభావంతో ఉన్నామని నిఖిల్‌ మీడియా ద్వారా తెలిపాడు.

- Advertisement -