సీఏఏని పున:సమీక్షించాలి..: సీఎం కేసీఆర్

285
cm kcr
- Advertisement -

సీఏఏపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌), జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)లకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం..పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రం పునరాలోచించాలన్నారు.

సీఏఏ,ఎన్‌పీఆర్,ఎన్‌ఆర్‌సీ విషయంలో కేంద్రం ద్వంద వైఖరిని అవలంభిస్తోందన్నారు. పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోందని…. పార్లమెంట్‌లో కూడా సీఏఏ బిల్లును టీఆర్‌ఎస్‌ వ్యతిరేకించిందని చెప్పారు.

భారతదేశం సెక్యులర్ దేశమని..మతప్రాతిపదికన విభజించి విద్వేశాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు. వందల సంవత్సరాల మెట్రో పాలిటన్‌ కల్చర్‌ ఉన్న దేశంలో మన వైఖరేంటో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వమానవ సౌభ్రాతృత్వం కోరుకుంటున్న సమయంలో ఇలాంటి చట్టాలు దేశ ప్రతిష్టను దిగజారుస్తాయని చెప్పారు.

దేశంలో అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని తెరమీదకు తీసుకురావడం సరికాదన్నారు.దీనిపై ఎవరు వ్యతిరేకంగా మాట్లాడిన దేశ ద్రోహులు అని చిత్రీకరిస్తున్నారని ఇది సరికాదన్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి సైతం సీఏఏని తప్పుబట్టారని ఆయన కూడా దేశద్రోహి అవుతారా అని ప్రశ్నించారు.

గోలీమారో నినాదాలు బాధ కలిగించాయని…డిల్లీ అల్లర్ల సమయంలో కేంద్రమంత్రులు,ఎంపీలు విద్వేషపూరతి వ్యాఖ్యలు చేశారని  చెప్పారు. సీఏఏ కారణంగా దేశ ప్రతిష్ట మంటగలుస్తోందన్నారు. సీఏఏపై కేంద్రం పునఃసమీక్షించుకోవాలని.. స్పష్టమైన అవగాహనతోనే సీఏఏ, ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.

- Advertisement -