నిఖిల్..’కేశవ’ ఫస్ట్ లుక్‌

102
Nikhil Keshava movie First Look

ఎక్కడికీ పోతావు చిన్నవాడా తర్వాత నిఖిల్ నటిస్తున్న చిత్రం కేశవ్‌. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పై నిఖిల్ భారీ ఆశలు పెట్టుకున్నాడు.తన కెరీర్ను మలుపు తిప్పిన స్వామి రారా చిత్ర దర్శకుడు సుదీర్ వర్మ దర్వకత్వంలో కేశవ అనే క్రైం థ్రిల్లర్ తెరకెక్కనుంది. ఇప్పటికే ప్రీ లుక్‌తో ఆకట్టుకున్న కేశవ్..తాజాగా ఫస్ట్ లుక్‌తో మరింతగా ఆకట్టుకున్నాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

కేశవ ఫస్ట్ లుక్‌ని నిఖిల్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘‘ఎక్కడి పోతావు చిన్నవాడా’ తర్వాత నా చిత్రం ఇది.. నా ఫస్ట్‌లుక్‌తో ‘కేశవ’ తొలి పోస్టర్‌. 50 శాతం షూటింగ్‌ పూర్తయింది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని నిఖిల్‌ ట్వీట్‌ చేశారు. పోస్టర్‌లో నిఖిల్‌ చాలా కోపంగా కనిపించారు. ఒక వైపు గుడి గోపురం, మరోవైపు జీపు.. రక్తంలో పడి ఉన్న తుపాకీని ఇలా ఆసక్తికరంగా పోస్టర్‌ను చూపించారు.

Nikhil Keshava movie First Look

నిఖిల్‌ 14వ చిత్రంగా తెరకెక్కుతోన్న ‘కేశవ’లో ‘పెళ్లి చూపులు’ చిత్రంలో నటించిన రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత ఏర్పడిన సంక్షోభంలోనూ విడుదలైన ఎక్కడికీ పోతావు చిన్నవాడా 30 రోజుల్లో 38 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Nikhil Keshava movie First Look