పవన్‌, ప్రభాస్‌లకు చోటు లేదు..

229
Pawan Kalyan
- Advertisement -

తెలుగునాట పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కు..బాహుబలి ప్రభాస్‌కు ఎంతటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే. టాలీవుడ్‌లో టాప్3 హీరోలెవరంటే ఇద్దరి పేర్లు చెప్పాల్సిందే. అంతటి ఫేమ్ సంపాదించుకున్నా ఈ హీరోలకు..సెలబ్రిటీ ఫోర్బ్స్ జాబితాలో మాత్రం స్థానం దక్కలేదు. ప్రముఖ మ్యాగజీన్ ఫోర్బ్స్ అధికారికంగా ప్రకటించిన సినీ, క్రీడారంగ తదితర రంగ ప్రముఖులతో కూడిన 2016 , టాప్ 100 జాబితాలో ఈ హీరోలకు. ఇండియన్ సెలబ్రిటీ ఫోర్బ్స్‌ టాప్ 100 లిస్ట్ లో టాలీవుడ్‌ కు సంబంధించి కేవలం నలుగురికి మాత్రమే చోటు కల్పించి తెలుగు సినీ అభిమానులను నిరాశలో ముంచింది. శుక్రవారం వెల్లడించిన తాజా జాబితాపై ఇవే ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు తెలుగుపరిశ్రమకు, తెలుగు స్టార్ హీరోలకు అన్యాయం జరిగిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Pawan Kalyan

టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్ టీఆర్, రామ్ చరణ్ మాత్రమే ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో స్థానం సంపాదించారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ ల పేర్లు ఆ జాబితాలో కనిపించకపోవడంపై సినీ పండితుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఫోర్బ్స్ అందించిన సమాచారం ప్రకారం ఆదాయం, కీర్తి, గూగుల్ ర్యాంకింగ్స్ , పత్రికల కవర్ పేజీ లాంటి ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రముఖులను ఎంపిక చేస్తారు. అయితే ముఖ్యంగా ఆదాయంలో గానీ, రాజకీయాల్లో గానీ, ఫ్యాన్ ఫాలోయింగ్ లో గానీ కీలకంగా ఉన్న పవర్ స్టార్, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ కు మాత్రం చోటు దక్కలేదు.

prabhas

మరో స్టార్ హీరో, బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ ఖ్యాతి గడించిన ప్రభాస్ కు ఫోర్బ్స్ టాప్ 100 జాబితాలో చోటు దక్కకపోవడంపై పెదవి విరుస్తున్నారు. ఈ ఇరువురు సాధించిన నేమ్ అండ్ ఫేమ్ సరిపోలేదా అనే అనుమానాలను వ్యక్తం చేశారు. అటు టాలీవుడ్ జక్కన్న గా పేరు గడించిన బాహుబలి దర్శకుడు రాజమౌళికి 100 జాబితాలో ప్లేస్ దక్కక పోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

- Advertisement -