హైదరాబాద్‌లో మస్తీగా చెర్రీ,తమన్నా

99

ధృవ సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. రీసెంట్ గా ఈ చిత్రం 50 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టింది. పెద్ద నోట్ల రద్దు సమస్య ఉన్న టైంలో చెర్రీ మూవీ సాధించిన ఈ ఫీట్ అందరిని ఆశ్యర్యపరుస్తోంది. ధృవ చిత్రం ఇప్పటికే రెండు వారాల సక్సెస్ ఫుల్ రన్ ని పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా టాలీవుడ్‌ హీరో రామ్‌చరణ్‌ దంపతులతోపాటు రకుల్‌ప్రీత్‌ సింగ్‌, తమన్నా, అఖిల్‌ పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో దిగిన ఫొటోలను తమన్నా, రకుల్‌, ఉపాసన సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. పార్టీలో తమన్నాతో కలిసి గ్రీన్‌ టీ తాగానని, ఉపాసనకు ఇది ఇష్టంలేదని నవ్వుతూ రకుల్‌ ట్వీట్‌ చేశారు. దీంతోపాటు తమన్నాతో దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. మీ అందర్నీ కలవడం ఆనందంగా ఉందని అఖిల్‌ ట్వీట్‌ చేశారు.

Ram charan partie with Tamannah

హైదరాబాద్‌లో మస్తీగా గడిచింది అంటూ.. తమన్నా చెర్రీ, రకుల్‌, అఖిల్‌తో కలిసి దిగిన ఫొటోను, ఇంకా పుట్టినరోజు ఫీలింగ్‌లోనే ఉన్నా అంటూ తమన్నా చెర్రీతో కలిసి కేక్‌ కట్‌ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Ram charan partie with Tamannah