నిఖిల్..కార్తికేయ 2 అప్‌డేట్

43
nikhil

ఈ ఏడాది వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు హీరో నిఖిల్. అర్జున్ సురవరం తర్వాత నిఖిల్ సినిమా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. ప్రస్తుతం ’18 పేజెస్’ షూటింగును పూర్తిచేసే పనిలో ఉన్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగు, మరో 10 రోజుల్లో పూర్తికానుంది.

ఈ సినిమా తర్వాత చందూ మొండేటితో కలిసి ‘కార్తికేయ 2’ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కూడా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ రెండు సినిమాల్లోను కథానాయిక అనుపమ పరమేశ్వరన్ కావడం విశేషం.

ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి.