‘స్పై’ మూవీ కోసం నిఖిల్ హై వోల్టేజ్ యాక్షన్..

94
Nikhil
- Advertisement -

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కధానాయకుడిగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పై షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గూడాచారి, ఎవరు, హిట్ లాంటి సూపర్ హిట్ చిత్రాల ఎడిటర్‌గా చేసిన గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై చరణ్ తేజ్ ఉప్పలపాటి సిఈఓగా నిర్మాత కె. రాజ శేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ జరుపుకుంటుంది.

హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జూలియన్ ఎస్ట్రాడాతో పాటు ఈ యాక్షన్ సెట్స్‌లో మేరీ కోమ్, శకుంతలా దేవి, తాన్హాజీ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలలో భాగమైన బాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కైకో నకహరా కనిపించారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ లీ విటేకర్ యాక్షన్ సన్నివేశాలను సూపర్ వైజ్ చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు మకరంద్ దేశ్‌పాండే పాటు అభినవ్ గోమతం, ఐశ్వర్యా మీనన్, సన్యా ఠాకూర్‌లు షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తించింది. తన మొదటి పాన్ ఇండియా చిత్రంగా విడుదల కాబోతున్న ‘స్పై’లో సరికొత్త లుక్, భిన్నమైన పాత్రలో అలరించనున్నారు నిఖిల్ . పూర్తి యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌గా భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను కూడా అందించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, అర్జున్ సూరిశెట్టి ఆర్ట్ డైరెక్టర్‌గా, రవి ఆంథోని ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. ఎడ్ ఎంటర్టైన్మెంట్స్ సిఈవోగా చరణ్ తేజ్ ఉప్పలపాటి ఈ ప్రాజెక్ట్ మొత్తం ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నారు.తెలుగు, హిందీ, తమిళం, కన్నడ ,మలయాళ భాషల్లో 2022 దసరాకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్, అభినవ్‌ గోమతం, సన్యా ఠాకూర్, జిషు సేన్‌గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ తదితరులు

సాంకేతిక విభాగం:
దర్శకత్వం, ఎడిటర్: గ్యారీ బిహెచ్
కథ, నిర్మాత: కె రాజ శేఖర్ రెడ్డి
సీఈఓ: చరణ్ తేజ్ ఉప్పలపాటి
సమర్పణ: ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
రచయిత: అనిరుధ్ కృష్ణమూర్తి
సంగీతం: శ్రీచరణ్ పాకాల
డీవోపీ: జూలియన్ ఎస్ట్రాడా
ఆర్ట్ డైరెక్టర్: అర్జున్ సూరిశెట్టి
కాస్ట్యూమ్స్: రాగా రెడ్డి, అఖిల దాసరి, సుజీత్ కృష్ణన్
ప్రొడక్షన్ డిజైనర్: రవి ఆంథోని
పీఆర్వో: వంశీ-శేఖర్

- Advertisement -