సర్వోదయ పాఠశాలను సందర్శించిన సీఎం కేసీఆర్‌..

45
CM KCR
- Advertisement -

సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలసిందే. ఇందులో భాగంగా శనివారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. సౌత్ మోతీభాగ్ లోని ఆ ప్రభుత్వ పాఠశాలలో పర్యటించిన కేసీఆర్ అక్కడి వసతులను, తరగతి గదులను పరిశీలించారు. సీఎం కేజ్రీవాల్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇక్కడ సీఎం కేసీఆర్‌ బృందానికి ఢిల్లీ డెప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీష్‌ సిసోడియా సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సర్వోదయ పాఠశాల డాక్యుమెంటరీని సీఎం కేసీఆర్‌ తిలకించారు. అనంతరం ఢిల్లీలోని మొహల్లా క్లినిక్ లను కూడా సందర్శించనున్నారు.

ఇక ఈ జాతీయ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ నెల 22న చండీగఢ్ వెళ్లనున్నారు. రైతుల ఉద్యమం సందర్భంగా మరణించిన 600 మంది అన్నదాతల కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల చొప్పున చెక్కులు అందించనున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ లతో కలిసి కేసీఆర్ ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

- Advertisement -