రహస్య గూఢచారిగా హీరో నిఖిల్..

58
nikhil siddharth

టాలీవుడ్‌ హీరో నిఖిల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం 18 పేజెస్,కార్తికేయ‌2 చిత్రాలతో బిజీగా ఉన్నాడు.అయితే వైవిద్యమైన పాత్రలతో ఆకట్టుకునే నిఖిల్‌ ఇప్పడు మరో ప్రయోగానికి సిద్దమైయ్యాడు. ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ లో రహస్య గూఢచారి పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ థ్రిల్లర్ మూవీని అనౌన్స్ చేశాడు నిఖిల్. ‘హిట్’, ‘ఎవరు’ లాంటి థ్రిల్లర్ సినిమాలకు వర్క్ చేసిన ఎడిటర్ గ్యారీ బిహెచ్ డైరెక్టర్ గా నిఖిల్‌తో ఈ సినిమాను చేస్తున్నాడు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేకర్స్ అనౌన్స్ చేశారు.

దీనిని ఒక స్పై థ్రిల్లర్ గా భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుపుతున్నారు. సరిహద్దులో భారతీయ జెండా.. సైనికులతో పాటు విదేశీ లొకేషన్లు ప్రకటన పోస్టర్‌లో ఆవిష్కరించారు. ఈ కథకు భారీ పరిధి ఉంది. ఇది స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన్ని ఎలివేట్ చేస్తున్న ఆసక్తికర పోస్టర్ అనడంలో సందేహం లేదు. ఈ చిత్రాన్ని రెడ్ సినిమాస్ బ్యానర్‌పై కే రాజా శేఖర్ రెడ్డి నిర్మాణం వ‌హిస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ మూవీకి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు.