మెగా డాటర్ నిహారిక పెళ్లిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. తనకు కాబోయే భర్తను హగ్ చేసుకుని ఫేస్ కనపడకుండా దిగిన ఫోటోను షేర్ చేసింది. నిహారిక షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నిహారికకు కాబోయే భర్తను చూడడానికి మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా నిహారిక భర్త సొంతూరు గూంటురు జిల్లా అని తెలుస్తుంది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ అధికారి కొడుకును నిహారిక పెళ్లి చేసుకోబోతున్నట్లు మెగా ఫ్యామిలీ వర్గాల సమాచారం. తాజాగా తన భర్త చైతన్యతో ఉన్న ఫోటోలను షేర్ చేసి సస్పెన్స్‌కు పుల్ స్టాప్ పెట్టింది నిహా.
నిహరిక ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తుంది. ఆమె హీరోయిన్ గా చేసిన సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో హీరోయిన్ పాత్రలకు గుడ్ బై చెప్పేసింది. ఇదంతా చూస్తుంటే తొందర్లోనే మెగా ఫ్యామిలీలో మరో పెళ్ళి జరుగనున్నట్లు తెలుస్తుంది.



