- Advertisement -
ప్రముఖ మలయాళ దర్శకుడు, కథా రచయిత సాచీ ఇకలేరు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. 48 ఏళ్ల సాచీ మృతితో మలయాళ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో కూరుకుపోయింది.
సాచీ అసలు పేరు కేఆఆర్ సచ్చిదానందన్. 2015లో అనార్కలితో మెగా ఫోన్ పట్టారు సాచీ. తర్వాత అయ్యప్పనుమ్ కొషియం సినిమాను తెరకెక్కించగా ఈ రెండు సినిమాల్లోనూ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరో.
అయ్యప్పనుమ్ కొషియుం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తెలుగుతో పాటు హిందీ, తమిళంలో ఇప్పుడు రీమేక్ చేస్తున్నారు. హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీలో భాగంగా ఆసుపత్రికి వెళ్లిన ఆయన విగతజీవిగా మారడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
- Advertisement -

