- Advertisement -
కరోనా విజృంభణ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కఠిన ఆంక్షలు అమలు విదించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో వైరస్ కట్టడికి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఆప్ సర్కారు ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. నేటి రాత్రి నుంచే (ఏప్రిల్ 6) అమల్లోకి రానుండగా.. ఈ నెల 30 వరకు కర్ఫ్యూ ఉంటాయని వివరించింది.అనుమతులు లేకుండా ఎవరైనా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
- Advertisement -