కాళేశ్వర విస్తరణలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం..

161
kaleshwaram
- Advertisement -

తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా అభివృద్ధి చేయాలనే భగీరథ తలంపుతో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ కార్యాచరణ నేడు కీలక మైలురాయిని దాటింది. ఇప్పటికే మేడిగడ్డ నుండి మిడ్ మానేరుకు చేరిన కాళేశ్వరం జలాలు.. అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్‌కు చేరుకున్నవి. మంగళవారం నాటి జలాల విడుదల కార్యక్రమం ద్వారా కొండపోచమ్మ సాగర్ జలాలను మొదట హల్దీ వాగులోకి వదిలి, మంజీరా నది ద్వారా నిజాం సాగర్‌కు తరలించే కార్యక్రమం చేపట్టారు సీఎం కెసిఆర్. తదనంతరం, కొండపొచమ్మసాగర్ జలాలను గజ్వేల్ కెనాల్ నుంచి సిద్దిపేట జిల్లాలోని 20 చెరువులను నింపేందుకు వదిలారు. దీంతో కాళేశ్వర ప్రాజెక్టు విస్తరణలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.

మంగళవారం ఉదయం ప్రత్యేక బస్సులో, సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అవుసులపల్లికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అక్కడ కాళేశ్వర జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి జలాలను విడుదల చేశారు. ఈ జలాలు సంగారెడ్డి కెనాల్‌ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాం సాగర్‌కు చేరుకుంటాయి. ఆ తర్వాత, మర్కూక్‌ మండలం పాములపర్తి గ్రామానికి చేరుకున్న సీఎం కెసిఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేసి, కాళేశ్వర జలాలను గజ్వేల్‌ కాల్వలోకి విడుదల చేశారు. ఈ జలాలు పరిసర ప్రాంతాల్లోని… పాములపర్తి చెరువు, పాతురు చెరువు, చేబర్తి చెరువు, ప్రజ్ఞాపుర్, గజ్వేల్, కేసారం, బయ్యారం, జాలియామా తదితర 20 చెరువులను నింపుతాయి.

ఈ కార్య‌క్ర‌మాల్లో… స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు హ‌రీష్ రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపీలు, జోగినపల్లి సంతోష్ కుమార్, కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, భూపాల్ రెడ్డి, గంగాధర్ గౌడ్, ఫరీదుద్దీన్, ఫరూక్ హుసేన్, రాజేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, గణేష్ గుప్తా, హన్మంత్ షిండే, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చిరుమర్తి లింగయ్య, సీహెచ్ మదన్ రెడ్డి, మహీపాల్ రెడ్డి, మాణిక్ రావు, సీఎం కార్యదర్శులు స్మితా సభర్వాల్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్ రావు, కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వి.సునీతా లక్ష్మారెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సంగారెడ్డి జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, సిద్దిపేట జెడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, మెదక్ జెడ్పీ చైర్ పర్సన్ హేమలతా శేఖర్, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపూర్ణ, ఎలక్షన్ రెడ్డి, జెడ్పీటీసీ బాలు యాదవ్, అవుసులపల్లి సర్పంచ్ జి.కరుణాకర్, ఎంపీటీసీ రాధ ప్రవీణ్, మర్కూక్ మండలం పాములపర్తి గ్రామ సర్పంచ్ తిరుమల రెడ్డి, ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, పీఏసీఎస్ చైర్మన్ బట్టు అంజిరెడ్డి తదితర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -