రాష్ట్రంలో కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నేటి నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించగా నేటి అర్థరాత్రి నుంచి మే 1 వ తేదీ వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కర్ఫ్యూ అమలు సమయంలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతులు ఉన్నాయి.అంతరాష్ట్ర రవాణాకు ఎలాంటి పాసులు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మినహాయింపు
అత్యవసర సేవలు, పెట్రోల్ బంకులు, మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆస్పత్రులు, ప్రయివేటు సెక్యూరిటీ సర్వీసులు, ఈ-కామర్స్ సేవలు,ఆహార పదార్థాల పంపిణీ, కోల్డ్ స్టోరేజ్‌లు, గోడౌన్లకు మినహాయింపు ఇచ్చారు. వైద్యం కోసం వెళ్లే గర్భిణులు, రోగులకు కూడా మినహాయింపు ఇచ్చారు.
నిషేధం
పౌరులు బయట తిరగడం, థియేటర్లు, పబ్బులు, క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, హోటల్స్ రాత్రి 8 గంటల తర్వాత బంద్ కానున్నాయి.