- Advertisement -
తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని నైట్ కర్ఫ్యూను మరో వారం పొడిగించారు. మే 8వ తేదీ ఉదయం 5గంటల వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. అయినప్పటికీ కొత్త కేసులు వెల్లువలా వస్తుండడంతో నైట్ కర్ఫ్యూను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయింది. నైట్ కర్ఫ్యూ సందర్భంగా నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అన్ని జిల్లాల పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
- Advertisement -