మాజీ ఎమ్మెల్యే జగన్నాథం గౌడ్ మృతి.. కేసీఆర్‌ సంతాపం..

27
cm kcr
cm kcr

ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం గౌడ్‌ అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో ఓ హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.. జగన్నాథం గౌడ్ మృతికి సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.. జగన్నాథం కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు కేసీఆర్‌. అలాగే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జగన్నాథం 1978లో జనతా పార్టీ నుంచి వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.