నైజిరియాలో దారుణం..317 మంది కిడ్నాప్

250
kidnap
- Advertisement -

నైజిరియాలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికల పాఠశాలలోకి ప్రవేశించిన కొంతమంది దుండగులు 317 మంది బాలికలను కిడ్నాప్ చేశారు. బాలికలంతా 10 నుంచి 13 సంవత్సరాల వయసుకలిగిన వారే.

కిడ్నాప్ కు గురైన బాలికలను సురక్షితంగా రక్షించేందుకు పోలీసులు, మిలటరీ సంయుక్త ఆపరేషన్ ను ప్రారంభించింది. కిడ్నాప్ చేసిన బాలికలను సమీపంలోని అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

గతంలో 2014లో బోర్నో స్టేట్ లోని చిబోక్ పాఠశాలలో ఉన్న 276 మంది బాలికలను ఇలానే కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లారు. అయితే, పోలీసులు వీరిని విడిపించారు. కానీ, ఇందులో 100 మంది బాలికలు ఏమయ్యారు అన్నది ఇప్పటి వరకు తెలియలేదు.

- Advertisement -