కరోనా కంటే నిఫా వైరస్ డేంజర్.. జాగ్రత్త!

30
- Advertisement -

2019లో చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ స్థాయిలో వణికించిందో అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా కంటే డేంజర్ గా ఉండే వైరస్ లు మద్య మళ్ళీ సవాల్ విసురుతున్నాయి. ముఖ్యంగా కరోనా తరహాలోనే లక్షణాలు ఉన్న నిఫా వైరస్ ఈ మద్య దేశంలో విజృంభిస్తోంది. ఈ వైరస్ తాలూకు కేసులు 2019, 2021 సంవత్సరాలలో కేరళ రాష్ట్రంలో ఎక్కువగా వెలుగు చూశాయి. మళ్ళీ ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే నిఫా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దాంతో ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇంకా కొందరిలో మెదడు వాపు, లోబీపీ వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ వైరస్ సోకిన రెండు వారాల సమయానికి వ్యాధి తీవ్రత ముదురుతుంది. తద్వారా లక్షణాలు మరింత పెరిగే అవకాశం ఉందట. జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. వంటి లక్షణాలు అదనంగా కనిపిస్తాయట. అయినప్పటికి ఈ వ్యాధి పట్ల నిర్లక్ష్యం చేస్తే కోమాలోకి చేరుకొని ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ లక్షణాలను గుర్తించి వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఈ వైరస్ కు ప్రత్యేకించి ఎలాంటి చికిత్స లేదు. కాబట్టి వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉంటూ సరైన టైమ్ లో వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఈ వైరస్ సోకకుండా ఉండేందుకు వ్యక్తిగత శుబ్రత చాలా అవసరం అలాగే మన చుట్టూ ప్రక్కల అనారోగ్యంతో ఉండే జంతువులకు ( పందులకు ) వీలైనంతా దూరం పాటించాలని, కుదిరితే వాటిని పశు సంరక్షణ కేంద్రాలకు తరలించాలని చెబుతున్నారు నిపుణులు.

Also Read:Bigg Boss 7 Telugu:శివాజీ – ప్రశాంత్‌లకు 3 స్టార్లు

- Advertisement -