- Advertisement -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటారు ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి నిధి చిలుముల.
హారిక ద్రోణవల్లి ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి బెంగళూర్లో తన నివాసంలో మూడు మొక్కలు నాటిన టెన్నిస్ క్రీడాకారిణి నిధి చిలుముల,ఈ సందర్బంగా నిధి మాట్లాడుతూ మొక్కలు నాటే ఈ కార్యక్రమంలో తననీ భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి అలాగే హారిక ద్రోణవల్లికి కృతజ్ఞతలు తెలిపారు. మరో ముగ్గురికి మొక్కలు నాటల్సిందిగా ఛాలెంజ్ చేశారు.ఛాలెంజ్ అందుకున్న వారు నటాషా, రిశిక సుంకర మరియు కర్మన్ తాండి ఉన్నారు.
- Advertisement -