వింతగా బర్త్‌డే జరుపుకున్న నటి..!

268
Nia Sharma

కొందరు ఏం చేసినా అంద‌రికంటే వెరైటీగా చేయాలని, జ‌నాల్లో ఒకేరోజు పాపుల‌ర్ అయిపోవాల‌ని వింత పనులు చేస్తుంటారు. అలాంటి పనే టీవీ సెలెబ్రిటీ నియా శ‌ర్మ చేశారు. నటి నియా శర్మ తాజాగా తన పుట్టిన రోజు సందర్బంగా కట్ చేసిన బర్త్ డే కేక్ విమర్శల పాలు అయ్యింది. కేక్‌ కట్‌ చేస్తే తప్పేంటి అనుకోకండి అక్కడే ఉంది అసలు ట్విస్ట్‌. ఈ అమ్మడు కట్‌ చేసిన కేక్ పై పురుషుడి ప్రైవేట్ పార్ట్‌ను పెట్టడంతో పాటు వల్గర్‌గా ఆ కేక్ కటింగ్‌ చేసింది.

అంతేకాదు బ‌ర్త్‌డేకు సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను నియాశ‌ర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు, వీడియోల్లో నియాశ‌ర్మ చేసిన ప‌నిని చూసి నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆమె చేసిన ప‌నికి త‌గిన‌ట్టే అసభ్య‌క‌ర కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. డ‌ర్టీ బ‌ర్త్‌డే, డ‌ర్టీ సెల‌బ్రేష‌న్స్ అంటూ మండిప‌డుతున్నారు. ఇదేం దిక్కుమాలిన క్రియేటివిటీ అన్నట్లుగా మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.