Bigg Boss 7 Telugu:శివాజీ కన్నిటీ పర్యంతం

25
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 45 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఈ వారం నామినేషన్స్‌లో లీస్ట్‌లో ఉన్నవారిలో ఒకరు ఎలిమినేట్ కానుండగా అది భోలే అని తెలుస్తోంది. ఎందుకంటే ఇంటి సభ్యులంతా ఆయన బిహేవియర్ నచ్చక ఎలిమినేషన్‌కు నామినేట్ చేయగా ప్రేక్షకులు సైతం ఇదే కరెక్ట్ అనే భావనలో ఉన్నారు.

ఇక తాజా ఎపిసోడ్‌లో భాగంగా బెడ్ మీద కూర్చొని యావర్‌తో మాట్లాడుతూ శివాజీ బాధపడ్డాడు. తాను ఇక్కడ ఉండలేనురా.. రాత్రి నుంచి చాలా దిగులుగా ఉంది.. నా బిడ్డల మీద ఒట్టేసి చెబుతున్నా.. కేవలం మీ ఇద్దరి కోసమే నేను ఇక్కడున్నాను అని చెప్పారు. లేకపోతే నాగార్జున ని అడిగి ఎప్పుడో వెళ్లిపోయే వాడిని అంటూ బాధపడ్డారు. నా వల్ల కావట్లేదురా.. నేను స్ట్రాంగే కానీ ఇంత బాధ ఎప్పుడూ అనుభవించలేదు అంటూ ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకున్నారు. .

తర్వాత శివాజీ – తేజ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అమర్‌లో కూడా ఫన్ యాంగిల్‌లోకి లాక్కురావడానికి టీమ్ ఈజ్ ట్రైయింగ్. అంటూ తేజ అనగా దీనికి శివాజీ రిప్లయి ఇస్తూ అమరదీపం గాలి మొత్తం తీసేశాడు. “వాడు కన్ఫ్యూజ్‌లో ఉన్నాడు ఇప్పటికీ.. వాడి కెరీర్‌లో కూడా.. అసలు వాడు హీరోనా, కామెడీ ఆ అంటూ కామెంట్ చేశాడు. కామెడీ హీరో.. వాడు చేసేది కూడా క్లారిటీ ఉండదు అంత.. నేచురల్ రావట్లేదు.. ఏదో వాంటెడ్‌గా చేసినట్లు ఉంటుందని అమర్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు శివాజీ.

Also Read:జపాన్…అడ్వెంచరస్ థ్రిల్లింగ్ టీజర్

- Advertisement -