ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ భోణి కొట్టింది. ఇంగ్లండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో కివ్స్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. రూట్ ( 86 బంతుల్లో 77 పరుగులు ), బట్లర్ ( 43 బంతుల్లో 42 పరుగులు ) తప్ప మిగిలిన బ్యాట్స్ మెన్ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు. ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన కివీస్ జట్టు ఏ మాత్రం తడబడకుండా వికెట్ నష్టానికి 36 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్స్ లలో డేవిడ్ కన్వే ( 121 బంతుల్లో 152 పరుగులు ), రచిన్ రవీంద్ర ( 96 బంతుల్లో 123 పరుగులు ) సెంచరీలతో చెలరేగడంతో కివీస్ సునాయసంగా విజయం సాధించింది. .
కాగా 2007 నుంచి వరల్డ్ కప్ గణాంకాలను పరిశీలిస్తే.. మొదటి మ్యాచ్ లో సెంచరీ చేసిన ఆటగాడి జట్టు వరల్డ్ కప్ సొంతం చేసుకుంటూ వచ్చింది. 2007 లో రికీ పాంటింగ్ మొదటి సెంచరీ నమోదు చేయగా ఆ ఏడాది వరల్డ్ కప్ ఆస్ట్రేలియానే సొంతం చేసుకుంది. ఇక 2011 లో మొదటి సెంచరీ సెహ్వాగ్ చేయగా ఆ ఏడాది ఇండియా కప్పు సాధించింది, 2015 లో ఆరోన్ పించ్ తొలి సెంచరీ చేయగా ఆస్ట్రేలియా, 2019 లో రూల్ తొలి సెంచరీ చేయగా ఇంగ్లండ్ జట్లు కప్పు సాధించాయి. ఇలా చూస్తే తొలి సెంచరీ చేసిన ప్లేయర్ జట్టు కప్పు గెలిస్తే ఈ ఏడాది కివీస్ కు కప్పు సొంతం చేసుకుందా అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇక నేడు జరిగే వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్తాన్ తో నెదర్లాండ్ తలపడనుంది. నెదర్లాండ్ తో పోల్చితే పాక్ పటిష్టంగా ఉంది. దాంతో పాక్ విజయం సునాయసమే అని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read:Bigg Boss 7 Telugu:కెప్టెన్సీ రేస్ నుంచి శోభాశెట్టి ఔట్