గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న నుతన వధూవరులు..

38
Green India Challenge

టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్రా కె గ్రామం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. గ్రామంలో జరిగే ప్రతి పెళ్లి వేడుకల్లో,ప్రతి ఒక్కరి జన్మదినం రోజున గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటాలని గ్రామపంచాయతి తిర్మాణించింది.

ఆదివారం తెలంగాణ ప్రభుత్వం నిబంధనల మేరకు కొవిడ్ అంక్షలు పాటిస్తు జరిగిన పెళ్లిలో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ముఖ్రా కె గ్రామంలో నుతన వధూవరులు “అలంక, చంద్రకాంత్” (వరుడు చంద్రకాంత్ ముఖ్రా కె గ్రామం,వదువు అలంకా మెండాపల్లి గ్రామం )లు మొక్కలు నాటారు. ఈ కార్యక్రంలో సర్పంచ్ గాడ్గె మినాక్షి ఎంపీటీసీ గాడ్గె సుభాష్ పాల్గొన్నారు.