అంధురాలిగా నయనతార..!

40
Nayanthara

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘నెట్రికన్’. కొరియన్ మూవీ ‘బ్లైండ్’కి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతోంది ఈ సినిమా. అయితే, నయన్ కంటి చూపులేని అమ్మాయిగా నటిస్తోన్న ఈ సినిమా ఓ థ్రిల్లర్. ఒక సీరియల్ కిల్లర్ ని ఓ అంధురాలు ఎలా పట్టుకుందనేదే స్టోరీ. గత నవంబర్ లోనే టీజర్‌ విడుదలైంది. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, ప్రస్తుత లాక్ డౌన్ కాలంలో ‘నెట్రికన్’ ఓటీటీ బాట పట్టవచ్చని అంటున్నారు.

నయనతార తన కెరీర్‌లో మొదటిసారి ఇలాంటి ఛాలెంజింగ్ రోల్‌లో నటిస్తుండగా క్రాస్ పిక్చర్స్ వారితో కలిసి రౌడీపిక్చర్స్ బ్యానర్‌పై విఘ్నేశ్ శివన్ నిర్మిస్తున్నాడు. ఇటీవలే కోలీవుడ్ సెలబ్రిటీలు ‘నేట్రికన్’ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌తోనే సినిమా మీద అంచనాలు పెరిగాయి. గృహం’ ఫేమ్ మిలింద్ రౌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.