బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తాం- మంత్రి ఎర్రబెల్లి

27

మహబూబాబాద్ జిల్లాలో గిరిజన యువతిపై లైంగిక దాడి చేసి హతమార్చిన ఘటనపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీరియస్‌గా స్పందించారు. యువతిపై లైంగిక దాడి చేసి , పాశవికంగా హత్య చేసిన విషయం తెలుసుకున్న మంత్రి జిల్లా ఎస్పీ, కలెక్టర్‌తో మాట్లాడి బాధితులకు వెంటనే న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం పరంగా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.