కౌలు రైతులకు న్యాయం చేస్తాం: సీఎం కేసీఆర్

34
kcr

కౌలు రైతులను పట్టించుకోకుంటే అసలుకే మోస్తం వస్తుందన్నారు సీఎం కేసీఆర్. శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన సీఎం…కౌలు రైతులు నష్టపోతే వారిని మానవీయ కోణంలో ఆదుకుంటామని తెలిపారు. రైతాంగానికి మంచి ప‌నులు చేస్తున్నాం. మంచి ఫ‌లితాలు వ‌స్తున్నాయన్నారు. కౌలు రైతులు, గిరిజ‌న రైతులు న‌ష్ట‌పోతే.. వందో, రెండు వంద‌ల కోట్లు ఇచ్చి ఆదుకోలేనంత దుస్థితిలో తెలంగాణ ప్ర‌భుత్వం లేద‌న్నారు. కౌలు రైతుల‌కు కూడా న్యాయం చేసే ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు సీఎం కేసీఆర్.

తెలంగాణ‌లో భూముల విలువ పెరిగిపోతోంది. ఈ క్ర‌మంలోనే పార‌ద‌ర్శ‌క‌త కోసం ధ‌ర‌ణి పోర్ట‌ల్ తీసుకొచ్చాం అన్నారు. ధ‌రణి పోర్ట‌ల్ ద్వారా రైతుల‌కు చాలా ఉప‌శ‌మ‌నం వ‌చ్చిందన్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో అనేక ల‌క్ష‌లాది రిజిస్ట్రేష‌న్లు జ‌రుగుతున్నాయన్నారు.

అస‌లు రైతు న‌ష్ట‌పోవొద్దు అనేది మా పాల‌సీ. అస‌లు రైతులు త‌మ భూముల‌ను వార‌స‌త్వంగా కాపాడుకుంటున్నారు. అస‌లు రైతుల‌కు క‌ష్టాలు వ‌స్తే ఉప‌వాస‌మైనా ఉంటారు కానీ.. భూముల‌ను అమ్ముకోరన్నారు.