కొత్త పాస్‌పోర్ట్ నిబంధనల్లో ఏముంది?

4
- Advertisement -

పాస్‌పోర్ట్ ఫీజులను పెంచడం 15 ఏళ్లలోపు పిల్లల పాస్‌పోర్ట్ చెల్లుబాటు కాలాన్ని సవరించడంతో పాటు పలు సేవల రుసుములను మారుస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త పాస్‌పోర్ట్ నిబంధనలను అమల్లోకి తెచ్చింది.

కొత్త నిబంధనల ప్రకారం, 15 ఏళ్లలోపు పిల్లలకు మంజూరు చేసే సాధారణ 36 పేజీల పాస్‌పోర్ట్ చెల్లుబాటు కాలం 5 సంవత్సరాలు లేదా ఆ చిన్నారికి 18 ఏళ్లు వచ్చే వరకు (ఏది ముందైతే అది) మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

సవరించిన ఫీజుల ప్రకారం కొత్త పాస్‌పోర్ట్‌లు, రీ-ఇష్యూ (తొలిసారి పొందడం, పునరుద్ధరణ) మరియు తత్కాల్ సేవలకు ఫీజులను పెంచారు.

పెద్దలకు (Adults – 18 ఏళ్లు పైబడిన వారికి):

సాధారణ కేటగిరీ (36 పేజీలు): ఫీజు రూ. 1,500 నుండి రూ. 2,500కు పెరిగింది.

సాధారణ కేటగిరీ (60 పేజీలు): ఫీజు రూ. 2,000 నుండి రూ. 3,500కు పెరిగింది.

తత్కాల్ సేవలు (36 పేజీలు): ఫీజు రూ. 3,500 నుండి రూ. 5,000కు పెరిగింది.

తత్కాల్ సేవలు (60 పేజీలు): ఫీజు రూ. 4,000 నుండి రూ. 6,000కు పెరిగింది.

తత్కాల్ కింద 60 పేజీల పాస్‌పోర్ట్ రీప్లేస్‌మెంట్: ఫీజు రూ. 5,500 నుండి రూ. 8,500కు పెరిగింది.

మైనర్లకు (Minors – పిల్లలకు):

సాధారణ కేటగిరీ (36 పేజీలు): ఫీజు రూ. 1,000 నుండి రూ. 1,750కు పెరిగింది.

తత్కాల్ కేటగిరీ: ఫీజు రూ. 3,000 లేదా రూ. 4,250గా సవరించబడింది.

Also Read:నానితో కయాదు లోహార్..

8 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు మరియు 60 సంవత్సరాలు పైబడిన జ్యేష్ఠ పౌరులు కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఫీజులో 10 శాతం మినహాయింపు/డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఈ డిస్కౌంట్ రీ-ఇష్యూ (పాస్‌పోర్ట్ పునరుద్ధరణ) కేసులకు వర్తించదు.

పాస్‌పోర్ట్ పోయినా లేదా పాడైపోయినా ఇచ్చే రీప్లేస్‌మెంట్ పాస్‌పోర్ట్‌లు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC) వంటి ఇతర అన్ని రకాల సేవలకు కూడా రుసుములను సవరించారు.

- Advertisement -