మళ్లీ గెలిచి వస్తా:దానం

6
- Advertisement -

ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవిపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. తీర్పుపై తదనంతర చర్యల గురించి మాట్లాడుతూ, ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

హైకోర్టు తీర్పుపై ప్రస్తుతానికి సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై తాను ఎలాంటి ఆలోచన చేయలేదని దానం నాగేందర్ స్పష్టం చేశారు.తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని, పోరాటాలు చేయడం తనకు కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు.

Also Read:మన్నె క్రిశాంక్ రిమాండ్ రిజెక్ట్

నియోజకవర్గంలో ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా తాను సిద్ధంగా ఉన్నానని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని చెప్పారు. ఖైరతాబాద్ ప్రజల ఆశీస్సులు, మద్దతు ఎప్పుడూ తనకే ఉంటాయని, ఉప ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి ఘన విజయం సాధించి శాసనసభలో అడుగుపెడతానని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -