మన్నె క్రిశాంక్ రిమాండ్ రిజెక్ట్

6
- Advertisement -

బిఆర్ఎస్ పార్టీ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నాంపల్లి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోలీసులు దాఖలు చేసిన రిమాండ్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.

శుక్రవారం ఉదయం 5 గంటలకే మన్నె క్రిశాంక్ నివాసానికి వెళ్లిన పోలీసులు దౌర్జన్యంగా ఇంటి గేటు, తలుపుల తాళాలు పగలగొట్టి ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ అంశంపై ట్వీట్ చేశారనే నెపంతో ఆయనపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు.

ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు, పోలీసులు మోపిన అభియోగాల్లో తగిన ప్రాథమిక ఆధారాలు లేకపోవడాన్ని గమనించి రిమాండ్‌ను తోసిపుచ్చింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు బనాయించి రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, తలుపులు పగలగొట్టి మరీ ముందస్తు నోటీసులు లేకుండా అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని బిఆర్ఎస్ వర్గాలు ఆరోపించాయి. కోర్టు నిర్ణయంతో బిఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

Also Read:హైకోర్టు తీర్పు..కాంగ్రెస్‌కు చెంపపెట్టు

- Advertisement -