తిరుమల చేరుకున్న సీఎం కేసీఆర్‌..

220

తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా తిరుమల పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. నేడు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం తిరుపతి పయనమయ్యారు.

కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ తిరుమల చేరుకున్నారు. తిరుమల శ్రీకృష్ణ అతిథిగృహం వద్ద కేసీఆర్‌కు టీటీడీ ఈవో సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు ఘనస్వాగతం పలికారు. ఇవాళ రాత్రి శ్రీకృష్ణ అతిథిగృహంలో కేసీఆర్ బస చేయనున్నారు. రేపు ఉదయం 5.30కి కేసీఆర్ శ్రీవారిని దర్శించుకోనున్నారు.

kcr